VIDEO: 'కిడ్నాపర్లను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలి'
NLG: తిప్పర్తి మండలం ఎల్లమ్మ గూడెం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ అభ్యర్థి నాగలక్ష్మి కుటుంబాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పరామర్శించారు. నాగలక్ష్మి భర్త కిడ్నాప్ ఘటనపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే కిడ్నాప్ చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్‌ను ఫోన్ ద్వారా మాట్లాడి కోరారు.