తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12-15 గంటల సమయం పడుతుండగా.. భక్తులు శిలాతోరణం వరకు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,112 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,054 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.