అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలు సీజ్

BPT: బల్లికురవ మండలం నుంచి ఎలాంటి బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న రెండు గ్రానైట్ పలకల లారీలు, మరో ముడి రాయి లారీని ఒంగోలు విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. బిల్లులు లేకపోవడంతో మూడు లారీలను బల్లికురవ పోలీసులకు అప్పగించారు. లారీలలో ఉన్న గ్రానైట్ పలకల కొలతల ఆధారంగా జరిమానా విధిస్తామని మైనింగ్ అధికారులు తెలిపారు.