రాజగోపురంలో వన దుర్గమ్మకు పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసానిపల్లి శివారులోని వెలసిన వన దుర్గ భవాని మాతకు స్థానిక రాజగోపురం వద్ద ఆదివారం ఉదయం నిత్య పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయం జలదిగ్బంధం కావడంతో గత మూడు రోజుల నుంచి రాజగోపురం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రభాత సేవలు, పంచామృతాలతో అభిషేకం మంగళహారతి పూజలు చేస్తున్నారు. భక్తుల దివ్య దర్శనం కొనసాగుతున్నాయి.