ప్రగతి నగర్‌పై సీఎం చొరవ చూపాలి: నగేష్ ముదిరాజ్

ప్రగతి నగర్‌పై సీఎం చొరవ చూపాలి: నగేష్ ముదిరాజ్

HYD: నిజాంపేట్ పరిధిలోని ప్రగతి నగర్‌లో సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు నగేష్ ముదిరాజ్ అన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సంబంధిత అధికారులు చొరవ చూపాలని ఆయన కోరారు. ప్రగతి నగర్ రోడ్డు మార్గాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.