ఆర్టీసీ డిపో ఎదుట తీవ్ర ఉద్రిక్తత..
NGKL: కల్వకుర్తి ఆర్టీసీ డిపో ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులను నడిపించేందుకు ప్రయత్నించగా, ఆర్టీసీ మహిళా కార్మికులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో కార్మికులకు, పోలీసులకు మధ్య పెను తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.