నరసాపురంలో ముగిసిన 'సాగర్ కవాచ్'
W.G: నరసాపురంలో డీఎస్పీ శ్రీవేద పర్యవేక్షణలో 2 రోజుల సాగర్ కవాచ్ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. సముద్రతీర భద్రతను, ఉగ్రవాద బెదిరింపులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పరీక్షించడంలో భాగంగా, మెరైన్ పోలీసులు, సాధారణ పోలీసులు జిల్లా తీరం వెంబడి గస్తీ నిర్వహించారు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి వంటిప్రాంతాలలో పోలీసులు నిఘా ఏర్పాట్లు పరిశీలించారు.