ప్రజలు ప్రతి శుక్రవారం 'డ్రైడే' పాటించాలి: కమిషనర్

ప్రజలు ప్రతి శుక్రవారం 'డ్రైడే' పాటించాలి: కమిషనర్

VSP: విశాఖ ప్రజలు ప్రతి శుక్రవారం 'డ్రైడే' పాటించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ఇంటి బయట పూల కుండీలు, కొబ్బరి బొండాలు, ఖాళీ బాటిళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వాటర్ ట్యాంకులపై మూతలు పెట్టాలన్నారు. దీర్ఘకాలికంగా నీటి నిల్వ ఉన్న చోట దోమలు వృద్ధి చెందుతాయన్నారు. విశాఖను దోమల రహిత నగరంగా తీర్చి దిద్దుదామని పిలుపునిచ్చారు.