వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్సై
ప్రకాశం: పొదిలి పట్టణంలో ఎస్సై రాజేష్ కుమార్ సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ఆటోలకు అదనపు ఎల్ఈడీ లైట్లు ఉండటం గమనించి వాటిని దగ్గరుండి తీసివేయించారు. ఎస్సై మాట్లాడుతూ.. ఆటోలకు అదనంగా ఎల్ఈడీ బల్బులు ఉండటం వల్ల ప్రమాద జరిగే అవకాశం ఉందని ఆటోలకు అదనపు లైట్లు బిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.