జ్వ‌రం వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే?

జ్వ‌రం వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే?

జ్వరం వచ్చిన వారు డీహైడ్రేషన్ భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని నీరు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. కాబట్టి జ్వరం ఉన్నవారు నీళ్లను అధిక మోతాదులో తాగాలి. కూల్ డ్రింక్స్, టీ, కాఫీ, మద్యం వంటి వాటిని తీసుకోవద్దు. ఇవి డీహైడ్రేషన్‌ను కలగజేస్తాయి. నీళ్లను అధికంగా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. దీంతో జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు.