నూతన మున్సిపాలిటీ భవనాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే

నూతన మున్సిపాలిటీ భవనాన్ని శుభ్రం చేసిన ఎమ్మెల్యే

BDK: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా 99 రోజుల కార్యాచరణను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీ భవనాన్ని స్వయంగా పరిశుభ్రం చేశారు.