ఇంటింటి ప్రచారంలో బీజేపీ నేత మాధవీ లత
BDK: భద్రాచలంలో ఇంటింటి ప్రచారంలో బీజేపీ నేత మాధవీ లత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీలకు వచ్చిన కేంద్ర నిధుల్లో BRS ప్రభుత్వం 50% మాత్రమే వినియోగించిందన్నారు. BJP-TDP-జనసేన మద్దతుతో ఉన్న సర్పంచ్ అభ్యర్థి హరిచంద్రనాయక్‌ను గెలిపించాలని కోరారు. KCR భద్రాచలం వాగ్దానాలు నెరవేర్చలేదని విమర్శించి, కేంద్రం ద్వారా అభివృద్ధి నిధులు తెస్తామని తెలిపారు.