'అంగన్వాడి పిల్లలను సొంత పిల్లల్లా చూసుకోవాలి'

'అంగన్వాడి పిల్లలను సొంత పిల్లల్లా చూసుకోవాలి'

KNR: అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తమ సొంత పిల్లలుగా చూసుకుంటూ అత్యుత్తమ సేవలు అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ సందర్శించారు.