నేడు కొమరోలులో పర్యటించనున్న కేపీ. నాగార్జున

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ.నాగార్జున రెడ్డి నేడు కొమరోలు మండలంలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నట్లుగా వైసీపీ నాయకులు తెలిపారు. మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి వైసీపీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. కావున మండలంలోని పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు.