జమ్మిచేడు జమ్ములమ్మ అద్భుత రూపం

జమ్మిచేడు జమ్ములమ్మ అద్భుత రూపం

GDWL: గద్వాల నడిగడ్డ ప్రజల ఇలవేల్పు దేవత అయిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారు మంగళవారం రోజున ప్రత్యేక పూజలను అందుకున్నారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆరాధిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ భక్తులకు పరమానందాన్ని కలిగించింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకోగా, ఈ రోజున వారికి అన్నదానం కూడా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.