రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

CTR: జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.