VIDEO: అభివృద్ధి పనులను పరిశీలించిన సంతోష్ రెడ్డి
HNK: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను BJP జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి ఇవాళ నాయకులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రైల్వేస్టేషన్‌ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ చందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొన్నారు.