పీఎం మోదీని సన్మానించిన ఎంపీ

KRNL: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడంలో భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రధాని నరేంద్ర మోదీ విజేతగా నిలిచారని అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి కార్యాలయంలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ఆమె మోదీని సన్మానించారు.