నూతన ఇంఛార్జ్ తహాశీల్దారుగా వాసుదేవరావు

నూతన ఇంఛార్జ్ తహాశీల్దారుగా వాసుదేవరావు

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం ఇంఛార్జ్ తహశీల్దార్‌గా పామూరు తహశీల్దార్ శ్రీరామచంద్రుని వాసుదేవరావు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ తహశీల్దార్‌గా పనిచేస్తున్న షేక్ మహమ్మద్ హుస్సేన్ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో వాసుదేవరావును నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.