గుర్తుతెలియని మృతదేహం లభ్యం
KRNL: ఆదోని నగరూరు సమీపంలోని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇవాళ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి చేతిపై 'అంజి' అనే పచ్చబొట్టు, చేతికి దారాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు 92475 75607 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.