తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

BDK: దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఇవాళ జిల్లా కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా పరిశీలించారు. కార్యాలయంలోని విభాగాలను తనిఖీ చేసి ప్రజలకు అందుతున్నసేవలపై అధికారులను ఆరా తీశారు. దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి కుల, ఆదాయ, నివాస ధృవీకరణలు, రేషన్ కార్డు తదితర దరఖాస్తులపై వివరాలు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.