JEE MAIN 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం
JEE MAIN పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2026లో జరగనున్న పరీక్షల కోసం https://jeemain.nta.nic.in/లోకి వెళ్లి దరఖాస్తులు సమర్పించుకోవాలని NTA వెల్లడించింది. సెషన్ 1 రిజిస్ట్రేషన్ కోసం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు అవకాశం కల్పించింది. జనవరి 21-30 తేదీల మధ్య సెషన్ 1, ఏప్రిల్ 1-10 తేదీల మధ్య సెషన్ 2 పరీక్షలు జరుగుతాయని NTA ప్రకటించింది.