'నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా కృషి'

ADB: వరదల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని డీసీసీబీ ఛైర్మెన్ అడ్డి బోజారెడ్డి అన్నారు. ఆదివారం తాంసి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. నష్టపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు. రైతులను ఓదార్చి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు. ఆయనతో పాటు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు ఉన్నారు.