3 దశాబ్దాలుగా చీకటిలో మగ్గుతున్న గిరిజన ఆదివాసి ప్రజలు
BDK: బూర్గంపాడు సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్ (ఎస్టీ కాలనీ) ప్రజలకు కరెంట్ సౌకర్యం కల్పించాలని కోరుతూ,(DSFI) నేతలు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌కి ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ కాలనీ గత 30 ఏళ్లుగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కనీసం కరెంట్ సౌకర్యం కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని డీఎస్ఎఫ్ఎ నాయకులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.