'విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి'

SRCL: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సిరిసిల్ల సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ తెలిపారు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్లోని TGTWRDC మహిళా కళాశాలలో విద్యార్థినిలకు సైబర్ నేరాలపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాలలో తెలియని వ్యక్తులకు రెస్పాండ్ కావద్దన్నారు. మొబైల్లో తెలియని లింకులను ఓపెన్ చేయవద్దన్నారు.