మాజీ ఎమ్మెల్యేకు నివాళులర్పించిన మాజీ మంత్రి

MBNR: మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎర్ర సత్యం వర్ధంతి పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన గొప్ప నేత స్వర్గీయ ఎర్ర సత్యం అని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.