మున్సిపల్ కమిషనర్‌కు ఘన వీడ్కోలు

కోనసీమ: రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించి బదిలీపై విశాఖపట్నం కార్పొరేషన్‌కి వెళుతున్న మున్సిపల్ కమిషనర్ ఒమ్మి అయ్యప్ప నాయుడును మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ.. రామచంద్రపురం తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.