'తెలుగు ప్రజలను కాపాడిన గొప్పతనం లోకేశ్‌కు దక్కుతుంది'
PLD: నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలను కాపాడి, వారి గమ్య స్థానాలకు చేర్చిన గొప్పతనం మంత్రి నారా లోకేశ్‌కి దక్కుతుందని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. నేపాల్‌లో మారణ హోమం జరుగుతున్న సమయంలో తెలుగు వారు తమను రక్షించాలని నేరుగా మంత్రి లోకేష్ సహాయం కోరగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.