తాండూర్‌లో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

VKB: తాండూరు పట్టణంలో ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ ఉండదని చెప్పారు. ముర్షద్ దర్గా, గాంధీనగర్, విశ్వంభరకాలనీ, బృందావని కాలనీ, చెంగేష్పూర్ రోడ్డు మార్గం, గొల్ల చెరువు ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని తెలిపారు. ఈ ఇబ్బందులకు వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.