రెవెన్యూ అధికారిపై మాల మహానాడు ధర్నా

CTR: పెద్దపంజాణి మండలం రాజుపల్లికి చెందిన మంగమ్మ పొలాల రికార్డులు తారుమారు చేయడాన్ని నిరసిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు యామల సుదర్శన్, ఉపాధ్యక్షుడు గుండ మనోహర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ఆర్ అశోక్ పాల్గొని బాధ్యుడైన రెవెన్యూ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.