ఆకేరు వాగులో దూకి వ్యక్తి ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న చిదుముల మున్నెష్ (25) అనే యువకుడు, భూత వైద్యుడి వద్దకు వెళ్తుండగా, ఖమ్మం జిల్లా తిరుమాలయపాలెం ఆకేరు వాగు సమీపంలో ఆటో బురదలో కూరుకుపోయింది. అందరూ దిగిపోయాక, మున్నెష్ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహం కోసం గాలిస్తున్నారు.