నేడు దామరంచలో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

నేడు దామరంచలో అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

KMR: బీర్కూరు మండలం దామరంచలో నేడు కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి పేరుగాంచిన మల్లయోధులు తరలిరానున్నారు. మల్లయోధుల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుందని, ప్రేక్షకులకు కనువిందు చేయనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.