BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
AP: నెల్లూరు జిల్లాలోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ టాటా ఏస్ వాహనం, 3 బైకులను ఢీకొట్టి.. ఆ తర్వాత చెట్టును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. కంటైనర్ లారీ చేపల లోడుతో వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.