కడపలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు
కడప నగరంలోని ఎన్టీఆర్ కూడలిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి పాల్గొన్నారు. ముందుగా పార్టీ పసుపు జెండాను ఆవిష్కరించి, అనంతరం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.