'పాఠశాలలకు రాకున్నా టీచర్లకు జీతాలు'

'పాఠశాలలకు రాకున్నా టీచర్లకు జీతాలు'

TG: మెదక్ జిల్లా చేగుంట మండలంలోని పలువురు టీచర్లపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మక్కరాజ్ పేట స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని కొంతమంది ఉపాధ్యాయులు నెలల తరబడి పాఠశాలలకు రాకున్నా.. అధికారులతో కుమ్మక్కై పూర్తి వేతనాలు తీసుకున్నారట. దీనిపై పలువురు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపించాలని హైదరాబాద్ ఆర్జేడీ, మెదక్ డీఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.