25 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్

25 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్

VZM: ఎస్‌కోట మండలం పోతనపల్లి గ్రామంలో ఈరోజు సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా 25 మద్యం సీసాలతో పోలిశెట్టి పాండురంగ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఈమేరకు ద్విచక్ర వాహనం, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.