పెనుగంచిప్రోలులో రైతన్న మీకోసం కార్యక్రమం
కృష్ణా: పెనుగంచిప్రోలు మండల పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పంచ సూత్రాలపై అన్నదాతలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న'రైతన్నా మీకోసం' కార్యక్రమం ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రైతు క్షేమమే దేశ క్షేమంగా భావించే మహోన్నతమైన వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు.