రెండో విడత పనుల జాతర కార్యక్రమం

RR: నందిగామ మండల పరిధిలోని చేగూరు గ్రామంలో రెండో విడత పనుల జాతర-2025 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంకుడుగుంత నిర్మాణానికి నందిగామ తహసీల్దార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందన్నారు.