అక్రమ జొన్నలను పట్టుకున్న అధికారులు

ADB: అక్రమంగా తరలిస్తున్న జొన్నలను పట్టుకున్న ఘటన తాంసీ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యాపారి జొన్నలను అక్రమంగా తరలించి మంగళవారం ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి విక్రయించేందుకు ప్రయత్నించాడు. దీంతో పక్కా సమాచారంతో పోలీస్, వ్యవసాయ శాఖాధికారులు, రైతులు పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.