నీటి సమస్యను పట్టించుకోని అధికారులు

ATP: బుక్కరాయసముద్రం మండలం పసులూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో గత 2 రోజుల నుంచి నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లిన పరిష్కరించలేదని గ్రామస్తులు ఆరోపించారు. 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపురంకు వెళ్లి నీళ్లు తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.