గంజాయి మత్తులో యువకుడు వీరంగం
BDK: భద్రాచలం కేసీఆర్ కాలనీలో చంటి అనే యువకుడు గంజాయి మత్తులో ఇవాళ వీరంగం సృష్టించాడు. ఇంట్లో ఉన్న సామాన్లు వచ్చే పోయే వారిని బూతులు తిట్టుకుంటూ విచక్షణారహితంగా విసిరేశాడు. దీంతో కాలనీవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించరాదని, అతన్ని వెంటనే అరెస్టు చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.