సినీ పరిశ్రమకు పూర్తిగా సహకరిస్తాం: మంత్రి దుర్గేష్
AP: రాష్ట్రంలో సినీ పరిశ్రమ స్థాపనకు కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం, రాయితీలు అందిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పాలకొల్లులో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ తరగతులను మంత్రులు దుర్గేష్, రామానాయుడు, హీరో శ్రీకాంత్ ప్రారంభించారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామని, రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.