నేరాల నియంత్రణపై ప్రజలకు ఎస్సై అవగాహన

నేరాల నియంత్రణపై ప్రజలకు ఎస్సై అవగాహన

VZM: గుర్ల (M) కొండగండ్రేడు,మునకాల పేట గ్రామాలలో ఎస్సై నారాయణరావు సోమవారం సాయంత్రం నేరాల నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రధానంగా సైబర్ నేరాలు, మహిళలపై దాడులు, మాదకద్రవ్యాల నివారణ, ట్రాఫిక్ రూల్స్ తదితర అంశాలు తెలియజేశారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచారం, గంజాయి అమ్మకం వంటివి జరిగితే పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు.