రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

NGKL: పాలెం వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ చరణ్ తేజ్, డాక్టర్ పర్వీన్ నేరుగా గ్రామాల్లోని రైతులను కలుసుకొని పంటల నిర్వహణ, పురుగుల మందులు నేల సారం, నీటిపారుదల, పద్దతులపై వివరణాత్మకంగా సూచనలు అందించారు.