అక్రమ జంతు వేటను అరికట్టాలి: రేంజర్
MLG: ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో మంగళవారం వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేంజర్ రెహమాన్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ లక్ష్యమన్నారు. వన్యప్రాణులు పర్యావరణ సమతౌల్యానికి కీలకమని, అక్రమ జంతువుల వేటను అరికట్టాలని పిలుపునిచ్చారు.