డిండి ప్రాజెక్టు నిర్వాసితులకు కవిత మద్దతు
NLG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత 'జనం జాగృతి బాట' పేరిట ఇవాళ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్వాసితులను కలిశారు. 11 ఏళ్ల ఆలస్యంతో జరిగే నష్టాలను భర్తీ చేయాలని, పరిహారం, ఇళ్ల స్థలాలతో పాటు నెలవారీ భృతి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.