స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా పాలకొల్లు
W.G: పాలకొల్లు మున్సిపాలిటీ ఇవాళ నుంచి 'స్పెషల్ గ్రేడ్' హోదాను సంతరించుకుందని నరసాపురం ఆర్డీవో దాసి రాజు వెల్లడించారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతోనే ఈ గుర్తింపు లభించిందన్నారు. ఇందుకు సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ హోదాతో మున్సిపాలిటీకి అదనపు నిధులు, వసతులు సమకూరుతాయన్నారు.