గురుకులంలో అదనపు కలెక్టర్ తనిఖీలు

గురుకులంలో అదనపు కలెక్టర్ తనిఖీలు

MBNR:కేజీబీవీ బాలికల విద్యాలయంలో సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తెలిపారు. గురువారం మిడ్జిల్ మండల కేంద్రంలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, సర్కార్ బియ్యం నేలపాలు అయిన ఘటనపై విచారణ జరిపారు. బియ్యాన్ని ఆరబోసిన విషయాన్ని పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.