రైతుల దారి సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆదేశాలు

అన్నమయ్య: కలికిరి మండలం పారపట్ల గ్రామానికి చెందిన 20 మంది రైతులు తమ పంట పొలాలకు వెళ్లడానికి దారి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ముందు వాపోయారు. స్పందించిన ఆయన కలికిరి మండల తహసీల్దార్ మహేశ్వరీ బాయి ని పిలిచి దారికి అవసరమైన భూమిని చట్టబద్ధం గా సేకరించి దారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.