శ్రీవారి దర్శనార్థం వాహనాల్లో వచ్చే భక్తులకు విజ్ఞప్తి

TPT: తిరుమల శ్రీవారి దర్శనార్థంగా సొంత వాహనాల్లో వస్తున్న భక్తులు, అలసటతో లేదా రాత్రిపూట ప్రయాణించి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు తగినంత విశ్రాంతి తీసుకుని, రహదారి భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. గురువారం GNC వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో DSP విజయ్ శేఖర్, పాల్గొన్నారు.